బయోచార్ తో పంట భూమి సారాన్ని పెంచవచ్చని మీకు తెలుసా..

Table of Contents
Issue Date

Biochar Agriculture Can Increase Farmers Revenue And Reduce Pollution Details, Biochar, Biochar Agriculture , Farmers Revenue ,Reduce Pollution, Organic Fertilizers, Soil Quality, Cultivation, Coal, Natural Farming, High Yielding

ప్రస్తుతం వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల వినియోగం అధికంగా పెరిగిపోతూ ఉండడంతో పర్యావరణ కాలుష్యంతో పాటు పంటలు పండించే భూమి, తన సారాన్ని కోల్పోతోంది.అధిక దిగుబడి కోసం విచక్షణారహితంగా రసాయన మందులను ఉపయోగిస్తున్నారు.

Biochar Agriculture Can Increase Farmers Revenue And Reduce Pollution Details, B-TeluguStop.com
ఈ విషపూరిత రసాయనాలు( Chemicals ) మట్టిలో పూర్తిగా కలిసిపోవడం వల్ల నేల క్రమంగా తన సారాన్ని కోల్పోతుంది.మోతాదుకు మించి అధికంగా రసాయన మందులను పంటలపై చల్లితే కొంతవరకే పురుగులు, తెగుళ్లు,( Pests ) కలుపు నివారణకు ఉపయోగపడి, పొలంలో వేసిన దాదాపుగా 60% రసాయన మందులు నేలలో కలిసిపోయి నేల సారం దెబ్బతినడం, పర్యావరణ కాలుష్యం, మానవాళి ఆరోగ్యం పై ప్రభావం చూపుతున్నాయి.

ప్రస్తుతం వ్యవసాయ రంగం ప్రకృతి వ్యవసాయం లేదా సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.సేంద్రీయ పద్తులను( Organic Fertilizers ) పాటిస్తే పండించిన పంటలో నాణ్యత, నేల సారం కోల్పోకుండా ఉండడం, మనిషి ఆరోగ్యంగా ఉండటంతో పాటు పర్యావరణం సంరక్షించబడుతుంది.

అయితే చాలామంది ప్రకృతి వ్యవసాయం అంటే ఘనజీవామృతం, జీవామృతం, పంచ గావ్య లాంటివి మాత్రమే అనుకుంటారు.కానీ ప్రకృతి నుంచి లభించే వ్యవసాయ వ్యర్థాలను సేంద్రీయ పద్ధతుల్లో పోషకాలు అందించేలా మార్చుకోవచ్చు.

Telugu Agriculture, Biochar, Farmers, Natural, Reduce, Soil Quality-Latest News
మొక్కకు కావలసిన సూక్ష్మ స్థూల పోషకాలను సరఫరా చేయడంలో నేలకు అవసరమైన మేలు చేసే సూక్ష్మజీవుల పెంపుదలలో బయోచార్ ను( Biochar ) ఉపయోగించి నేలకు కావలసిన పోషకాలు అందించి నేలను సంరక్షించవచ్చు.బయోచార్ అంటే వ్యవసాయ వ్యర్ధాల నుంచి బొగ్గులు( Coal ) తయారు చేసి పొలంలో వెదజల్లడం.తక్కువ ఖర్చుతో భూసారాన్ని పెంచుకోవడానికి బయోచార్ ఒక ఉత్తమమైన మార్గం.భూగర్భ జలాల కాలుష్యం తగ్గించడానికి బయోచార్ ను ఉపయోగించాలి.అధిక కార్బన్ కలిగిన ఘన వ్యర్థాలను ఉపయోగించి తయారు చేసుకున్న బయోచార్ ఉత్తమ బల్కింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది.

Telugu Agriculture, Biochar, Farmers, Natural, Reduce, Soil Quality-Latest Nes
బయోచార్ పశువుల ఎరువులో ఉండే నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది.ఈ బయోచార్ ను నీడ కలిగిన ప్రదేశంలో నిలువ చేసుకొని, పొలంలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పంటకు అందించాలి.భారతదేశంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ బయోచార్ ను తయారు చేస్తున్నాయి.

అయితే ఈ బయోచార్ ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది.కాబట్టి రైతులు తమ పొలంలోనే వ్యర్ధాలతో బయోచార్ ను తయారు చేసుకోవాలి.

ఒక ఎకరాకు రెండు టన్నుల బయోచార్ అందిస్తే.నేల సారం బాగా పెరిగి మంచి దిగుబడి వస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!
ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter Follow Us on YouTube

Cyprus مفتوحة للمستثمرين – قد تكون مهتما
قبرص للاستثمار | إعلانات البحث
|
Sponsored
شقق للبيع في دبي قد تفاجئك
إعلانات البحث
|
Sponsored
قدتكون درجة الماجستير في ألمانيا أكثر مكافأة مما تعتقد
الحصول على درجة الماجستير في ألمانيا | إعلانات البحث
|
Sponsored
اكتشف الجواهر الخفية في سوق العقارات في دبي
شقق دبي | إعلانات البحث
|
Sponsored
كم تبلغ تكلفة فيلا فخمة في دبي؟ قد تفاجئك الأسعار
فيلا دبي | إعلانات البحث
|
Sponsored
إليكم الغرض من الثقب الموجود أسفل القفل
DailyTricks.com
|
Sponsored

Categories